కడప.జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి. సమీపంలో.వృద్ధజంట హత్య
జమ్మలమడుగు: , 26 అక్టోబర్ (హి.స.) కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప(60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరోవైపు ఓబులమ్మ అంగీకారంతో పెద్దక్క(53)తో స
కడప.జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి. సమీపంలో.వృద్ధజంట హత్య


జమ్మలమడుగు: , 26 అక్టోబర్ (హి.స.)

కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి సమీపంలో వృద్ధ జంట హత్య కలకలం రేపింది పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప(60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరోవైపు ఓబులమ్మ అంగీకారంతో పెద్దక్క(53)తో సుమారు 30 ఏళ్లుగా నాగప్ప సహజీవనం చేస్తున్నాడు. వీరు తాడిపత్రి రహదారిలో, పెద్ద పసుపుల మోటులో ఇటుకల బట్టీలు నడుపుతున్నారు. నాగప్ప, పెద్దక్క తాడిపత్రిలో రహదారిలోని ఇటుకల బట్టీ వద్ద నివాసముంటున్నారు. ఓబులమ్మ తన ఇద్దరు కుమారులతో జమ్మలమడుగు పట్టణంలో ఉంటున్నారు.

ఆదివారం ఉదయం నాగప్ప, పెద్దక్క తాడిపత్రి రహదారిలోని ఇటుకల బట్టీలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రోకలి బండతో వారిద్దరి తలలు పగలగొట్టి హతమార్చారు. పక్కనే ఉన్న గదిలో బీరువాలో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ హత్యలు డబ్బు కోసమా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande