అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌ ,ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.): పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అదే జరిగితే ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్దమే.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు


ఇస్లామాబాద్‌ ,ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.): పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కొద్దిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులతో రెండు దేశాల సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు.. ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకపోతే బహిరంగ యుద్దమే అని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.

తాజాగా పాక్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆఫ్ఘనిస్థాన్‌ శాంతిని కోరుకుంటుందనే విశ్వాసం ఉంది. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తాం. అందుకు మాకు ఓ అవకాశం ఉంది. కానీ, వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాయని అనుకుంటున్నా. గత నాలుగైదు రోజులుగా సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి’ అని అన్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఆసిఫ్‌ ఈ విధంగా స్పందించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande