
రామగుండం, 26 అక్టోబర్ (హి.స.)
నేటి యువతరంలో సామాజిక సేవా దృక్పథం, స్పృహ కలిగి ఉండటం అభినందనీయమని రామగుండం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాప్ అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఉపకరించే విధంగా యువత రక్త దానానికి ముందుకు రావడం వారి సామాజిక స్పృహకు నిదర్శనమన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సాటి మనిషికి ప్రాణదానం చేసినట్లు అని అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు