
మెదక్, 26 అక్టోబర్ (హి.స.)
మెదక్ జిల్లా అందోలు మండల పరిధిలోని ఏర్రారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిని శనివారం రాత్రి జోగిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏర్రారం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.34840 నగదు, 7 సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..