
మహబూబ్నగర్, 26 అక్టోబర్ (హి.స.) పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రజల ఆస్తుల రక్షణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 150 ఇళ్లను సోదాలు చేసి సరైన పత్రాలు లేని 19 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 06 ఆటోలు అనుమానాస్పదంగా ఉండడంతో ధృవీకరణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలనీలో నివాసం ఉంటున్న సందేహాస్పద వ్యక్తులపై విచారణ చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..