అర్ధరాత్రి వాహనాల తనిఖీలు.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసుల దృష్టి..
భద్రాద్రి కొత్తగూడెం, 26 అక్టోబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ సతీష్ కుమార్ పర్యవేక్
వాహన తనిఖీలు


భద్రాద్రి కొత్తగూడెం, 26 అక్టోబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ

మండల పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ సతీష్ కుమార్ పర్యవేక్షణలో పాల్వంచ టౌన్ పోలీసు బృందం కె ఎస్ ఎం బంక్ సమీపంలో వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాపై నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుమన్, జీవన్ రాజ్, కళ్యాణితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పాల్వంచ పరిధిలో ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహించి, అక్రమ రవాణా మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande