
జగిత్యాల, 26 అక్టోబర్ (హి.స.)
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసులు, జిల్లా పాత్రికేయుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ను నిర్వహించారు. అనంతరం విజేత, రన్నర్ జట్టులకు ట్రోఫీలను, జట్టు సభ్యులకు మెమొంటోలను ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు, మీడియా సమాజానికి రెండు ముఖ్యమైన వర్గాలు అని, సమాజంలో ఒకే లక్ష్యంతో పని చేస్తారని తెలిపారు. అదేవిధంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఈ ఆట విడుపు వల్ల కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారని తెలిపారు. అలాగే ప్రెస్, పోలీసుల మధ్య మంచి కో ఆర్డినేషన్ పెరుగుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు