రూ. 4.15 కోట్లు విలువ చేసే హైడ్రో ఫోనిక్ స్వాధీనం
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డిఆర్ఎ అధికారులు రూ. 4.15 కోట్లు విలువ చేసే 4.15 కిలోల హైడ్రో ఫోనిక్ గంజాయిని సీజ్ చేశారు. ఈ మేరకు ఒకరిని అరెస్ట్ చేశారు. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా హైదరాబాద్ డిఆర్ఎ హైదరాబాద్ జోన్ అధికార
హైడ్రో ఫోనిక్


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డిఆర్ఎ

అధికారులు రూ. 4.15 కోట్లు విలువ చేసే 4.15 కిలోల హైడ్రో ఫోనిక్ గంజాయిని సీజ్ చేశారు. ఈ మేరకు ఒకరిని అరెస్ట్ చేశారు. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా హైదరాబాద్ డిఆర్ఎ హైదరాబాద్ జోన్ అధికారులు ఓ వ్యక్తి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న భారతీయ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతని సామాగ్రిని తనిఖీ చేయగా బ్యాగ్ లో అడుగు భాగంలో ముద్ద రూపంలో ఆకుపచ్చ రంగు పదార్థాన్ని కలిగి ఉన్న ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది గంజాయికి పాజిటివ్ పరీక్షించబడింది. మొత్తం 4.15 కిలోల హైడ్రోఫోనిక్ కలుపును స్వాధీనం చేసుకున్నారు. ఎన్ డి పి ఎస్ చట్టం కింద ప్రయాణికుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande