ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహం పవిత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నాగర్ కర్నూల్, 26 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహ కార్యక్రమం వనవాసి కళ్యాణి పరిషత్, రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమా
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ


నాగర్ కర్నూల్, 26 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట

పట్టణంలో ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహ కార్యక్రమం వనవాసి కళ్యాణి పరిషత్, రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణ దేవ్ వర్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 111 ఆదివాసి గిరిజనుల సామూహిక వివాహం వారి సంస్కృతి సాంప్రదాయపద్ధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుణ్యకార్యానికి దేవుడు ఆశీస్సులు తప్పక ఉంటాయని.. నూతన దంపతులు జీవితాంతం సుఖ, సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. అడవులలో జీవిస్తున్న ఆదివాసీలు వారి జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుందని ఇలాంటి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande