సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలకు 33 వేల కోట్ల ఎల్‌ఐసీ సొమ్ము
పట్నా/ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.) అక్టోబరు 25: అదానీ గ్రూప్‌ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ కలిసి ఎల్‌ఐసీని 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేంద
Gautam Adani


పట్నా/ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.) అక్టోబరు 25: అదానీ గ్రూప్‌ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ కలిసి ఎల్‌ఐసీని 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన కథనం రాసింది. తమనెవరూ ప్రభావితం చేయలేదని, స్వతంత్రంగానే పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని ఎల్‌ఐసీ ఖండించినప్పటికీ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం తీవ్ర దుమారం సృష్టించింది. అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణ ఆ కంపెనీని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టింది. అమెరికా కంపెనీల తరఫున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధ్రువీకరించిన ఘటనతో 2024లో అదానీ గ్రూప్‌ మరోసారి ఒడిదొడుకులకు లోనైంది. ఇలాంటి తరుణంలో తాజాగా మోదీ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అదానీకి అండగా నిలిచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ వాషింగ్టన్‌ పోస్టు శనివారం కథనం వెలువరించింది. అదానీ కంపెనీలు ఎదుర్కొంటున్న చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గత మే నెలలో ఎల్‌ఐసీతో 3.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టించే ప్రతిపాదన చేసిందని కథనం తెలిపింది. అందులో 3.4 బిలియన్‌ డాలర్లు(రూ.28,000 కోట్లు) అదానీ బాండ్లు కాగా, 507 మిలియన్‌ డాలర్లు(రూ.5,000 కోట్లు) అదానీ కంపెనీల్లో

షేర్ల కొనుగోలు. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి మార్కెట్‌ నుంచి 585 మిలియన్‌ డాలర్లు బాండ్ల రూపంలో సేకరిస్తున్నట్లు ఈ ఏడాది మే నెలలో అదానీ గ్రూప్‌ ప్రకటించింది. కొద్ది రోజుల తర్వాత మే 30న మొత్తం డబ్బులు ఒకే సంస్థ(ఎల్‌ఐసీ) సమకూరుస్తున్నట్లు అదానీ ఒక ప్రకటన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande