తేజస్వీ యాదవ్ గెలిస్తే “వక్ఫ్ చట్టాన్ని” రద్దు చేస్తారు.. ఆర్జేడీ హామీపై బీజేపీ ఫైర్..
పట్నా/ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.) బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు
Tejashwi Yadav


పట్నా/ఢిల్లీ,26, అక్టోబర్ (హి.స.)

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇప్పుడు ఆర్జేడీ నేత, ఎంఎల్సీ ఖారీ సోహైబ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆర్జేడీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయితే, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు’’ అంటూ సోహైల్ అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్టులో.. ‘‘ ఆర్జేడీ నిజమైన స్వరూపం తెలిసింది. భూమిని దోచుకోవాలనే ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. జంగిల్ రాజ్ ఎలా ఉంటుందో అదే కనిపిస్తోంది’’ అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘ఎవరికి బుద్ధి చెప్పాలి. ఇవి జంగిల్ రాజ్ సంకేతాలు, దానిని అణిచివేయాలి’’ అని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ను గౌరవించవని, ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా అవమానిస్తాయని రిజిజు ఆరోపించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande