నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నిజామాబాద్, 27 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా మండల కేంద్రం మాక్లూర్ ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరిందనీ, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థలంలో కొత్త భవనం ప్రారంభించుకోవడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేవని ఆర్మూర్ ఎమ్మెల్య
ఆర్మూర్ ఎమ్మెల్యే


నిజామాబాద్, 27 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా మండల కేంద్రం మాక్లూర్ ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరిందనీ, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థలంలో కొత్త భవనం ప్రారంభించుకోవడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు.

సోమవారం వారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డిలతో కలిసి అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన అత్యవసరమని అన్నారు. ప్రస్తుత మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణంలో సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాను అభినందించారు. తాను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపన ఎంతో దృఢంగా ఉందని గణేష్ గుప్తా అన్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సహకారం మరువలేనిదని కొనియాడారు. 2022 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande