జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ భవిష్యత్ ముడి పడి ఉంది.. బిజెపి లక్ష్మణ్
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వారు నేడు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అజెండా మజ్లిస్ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంల
బిజెపి లక్ష్మణ్


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వారు నేడు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అజెండా మజ్లిస్ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ను గెలిపించే ప్రయత్నం జరుగుతుంది. చొరబాటుదారులు, రోహింగ్యలు పెత్తనం చలాయిస్తున్నారు. ఈ ఎన్నికను బీజేపీ కార్యకర్తలు సవాల్గా తీసుకోవాలి.” అని కోరారు.

తెలంగాణలో ఒక్క ఏడాదిలో 5 వందల హత్యలు జరిగాయి. పోలీసులకే రక్షణ లేదు. గన్ కల్చర్ పెరిగిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ఇక బీఆర్ఎస్ఈ గత చరిత్రనే.. మళ్లీ గెలిచేది లేదు. కాంగ్రెస్ మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలన మీద పట్టు కోల్పోయారు. ఐఏఎస్లు బలవంతంగా పదవి విరమణ చేసే పరిస్థితి వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకుని రాహుల్ గాంధీ అభాసు పాలయ్యారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాహుల్ కుటుంబం. మోడీ ఓటు బ్యాంక్ను చీల్చే కుట్ర. బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది మోడీ ప్రభుత్వంతోనే.” అని లక్ష్మణ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande