గురుకుల విద్యార్థిని ఆత్మహత్య ఘటన.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వర్షిత (15) ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆ
కేటీఆర్


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి

మండలం వంగరలోని పీవీ రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వర్షిత (15) ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారకమన్నారు.

రాష్ట్రంలో రెండేళ్లలో 100 మందికి పైగా విద్యార్థులు మరణించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలు ఈ స్థాయికి చేరుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి బాధ్యతలేదంటూ ఫైరయ్యారు. సానుభూతి, జవాబుదారీతనం అసలే లేవని దుయ్యబట్టారు.

కాగా.. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లొచ్చిన తర్వాత వర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటికి దూరంగా ఉండటమే కారణమని పోలీసులు తొలుత భావించారు. కానీ.. ఇటీవలే వర్షిత జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అవార్డు అందుకుంది. స్కూల్ టాపర్ కూడా అని తోటి విద్యార్థినులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీపావళికి ఇంటికెళ్లి వచ్చాక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వేధిస్తున్నారని, తనను ఇంటికి తీసుకెళ్లిపోవాలని వర్షిత తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande