కేటీఆర్ నా స్థాయికి తగిన వ్యక్తి కాదు.. మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి, 27 అక్టోబర్ (హి.స.) కేటీఆర్ తన స్థాయికి తగిన వ్యక్తి కాదని, బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలు అవుతుందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో మ
మంత్రి కోమటిరెడ్డి


యాదాద్రి భువనగిరి, 27 అక్టోబర్ (హి.స.)

కేటీఆర్ తన స్థాయికి తగిన వ్యక్తి కాదని, బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలు అవుతుందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ గుంటూరులో చదువుతున్నాడని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అయిదు ముక్కలు అవుతుందని, బీఆర్ఎస్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారన్నారు. బీఆర్ఎస్ హెచ్, బీఆర్ఎస్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎస్, బీఆర్ఎస్ హిమాన్షు, కవిత ఏమి పెట్టుకుంటుందో తెలియదని చెప్పారు.

కవిత నే హరీష్ రావు,సంతోష్ రావు కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు అని.. రామన్న జాగ్రత్త అంటు మాట్లాడిందని చెప్పారు. పేదోళ్లకు ఒక రోజు కూడా సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన లేని కేటీఆర్ గురించి మాట్లాడటం అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande