వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం కలకలాడింది.. మంత్రి కొండా సురేఖ
వరంగల్, 27 అక్టోబర్ (హి.స.) రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధి
మంత్రి కొండా సురేఖ


వరంగల్, 27 అక్టోబర్ (హి.స.) రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం కలకలాడిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంవత్సరాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత సన్న రకం వరి సాగుచేసే రైతులకు బోనస్ ఇచ్చామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande