మూడో రోజు ఆర్టీఏ తనిఖీలు.. 9 బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాద నేపథ్యంలో గత 3 రోజులుగా నగర శివారులలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్కుంటలో ప్రైవేట్ ట్రావెల్స్
ఆర్టిఏ తనిఖీలు


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాద

నేపథ్యంలో గత 3 రోజులుగా నగర శివారులలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్కుంటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులపై కేసు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా స్వీపర్ సీట్లతో నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్కి చెందిన ఒక బస్సును సీజ్ చేశామన్నారు. వరుస తనిఖీలు, రూల్స్ బ్రేక్ చేస్తున్న బస్సులు సీజ్ అవుతుండడంతో ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande