
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ జాములతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు రోజుకొకలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నపటికీ వ్యాపారులు ట్రాఫిక్ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లన్నీ ఆక్రమిస్తూ పార్కింగ్ స్థలాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాలు నిత్యం ట్రాఫిక్ సమస్యగా మారుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ కేవలం నోటీసులు జారీచేయడం లేదా జరిమానా విధిస్తారులే అనుకోవడం షరామాములైపోయింది. నగరంలోని వీఐపీ, వీవీఐపీ జోన్ లోని పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలావరకు ఇలాంటివి జరుగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..