స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో ఎమర్జెన్సీ లాండింగ్!
చెన్నై, 27 అక్టోబర్ (హి.స.) మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ
స్పైస్ జెట్ ఫ్లైట్


చెన్నై, 27 అక్టోబర్ (హి.స.) మదురై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (SG23) సోమవారం మధ్యాహ్నం గగనతలంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వెంటనే స్పందించిన పైలట్లు విమానాన్ని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 160 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది తో పాటు మొత్తం 167 మంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో సమస్యను గుర్తించిన పైలట్లు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. దీంతో చెన్నై విమానాశ్రయం అత్యవసర ల్యాండింగ్కు అనుమతి ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande