మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.) మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోన
Jaishankar


ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)

మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్‌ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు జీన్ షాహీన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం, ఇంధన భద్రత, చమురు, గ్యాస్ వాణిజ్యం గురించి చర్చించారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లుగా వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్‌లో తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande