వనపర్తి మున్సిపాలిటీకి రూ.18.70 కోట్ల నిధులు మంజూరు.. ఎమ్మెల్యే కృతజ్ఞతలు
వనపర్తి, 27 అక్టోబర్ (హి.స.) జిల్లా కేంద్రమైన వనపర్తి పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18.70 కోట్ల నిధులు మంజురు చేసిందని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఊఐడీఎఫ్ నిధుల నుంచి వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో సీసీ ర
వనపర్తి ఎమ్మెల్యే


వనపర్తి, 27 అక్టోబర్ (హి.స.)

జిల్లా కేంద్రమైన వనపర్తి పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18.70 కోట్ల నిధులు మంజురు చేసిందని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఊఐడీఎఫ్ నిధుల నుంచి వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంజూరికి సహకరించిన ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande