
తిరుమల, 27 అక్టోబర్ (హి.స.) తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. కొత్తగా టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి వెళ్లేవారికి స్వామివారి దర్శనం 12 గంటల్లో జరుగుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-4 గంటలు, రూ.300 స్పెషల్ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న(ఆదివారం) 80,021 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా..25,894 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ కానుకలు రూ.3.90 వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV