రేపు దేశవ్యాప్తంగా SIR అమలుపై ఈసీ ప్రెస్‌మీట్
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం (ECI) విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం సోమవారం సాయంత్రం 4:15 గ
EC


ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం (ECI) విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం సోమవారం సాయంత్రం 4:15 గంటలకు జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు పాల్గొని వివరాలను వెల్లడిస్తారని తెలిపారు.

SIR మొదటి దశ 10 నుంచి 15 రాష్ట్రాలను కవర్ చేయనున్నట్లు సమాచారం. వీటిలో 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను, నకిలీ ఎంట్రీలను తొలగించడం, బదిలీలు వంటి ఓటర్ల జాబితాను నవీకరించడం కోసం SIR ఒక కీలకమైన ప్రక్రియగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ముఖ్యంగా SIR అమలును త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలలో 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande