ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి-నారా లోకేష్..
కేడర్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలి..
ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి-నారా లోకేష్..


అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలి.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడండి. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని.. ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలి.. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు లోకేష్.. తుఫాన్‌ ప్రభావిత తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలి.. శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలి.. భారీవర్షాల కారణంగా ఎటువంటి అంటురోగాలు ప్రభల కుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు మంత్రి లోకేష్‌.. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్ లు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలి.. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలి.. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.. పంటపొలాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచుకోవాలి. మొంథా తుఫాన్‌ పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్‌ బాధితులకు ఎటువంటి సాయం అవసరమైన వెంటనే స్పందించేందుకు యంత్రాంగం 24×7 సిద్ధంగా ఉంటుందని తెలిపారు మంత్రి నారా లోకేష్‌..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande