కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా కెనడాలో మరో భారత సంతతి వ్యాపారవేత్తపై దారుణం చోటుచేసుకుంది. కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ (68) కాల్పుల్ల
కెనడా


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) విదేశాల్లో భారత సంతతికి చెందిన

వ్యక్తులపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా కెనడాలో మరో భారత సంతతి వ్యాపారవేత్తపై దారుణం చోటుచేసుకుంది. కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ (68) కాల్పుల్లో మరణించారు. బ్రిటీష్ కొలంబియాలోని అబాట్స్ ఫోర్డ్ లో ఆయన ఇంటి వెలుపల కారులో కూర్చుంటున్న సమయంలో ఓ దుండగుడు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 9.22 గంటల సమయంలో రిడ్జ్ వ్యూ డ్రైవ్ లో కాల్పులు జరిగాయి. పోలసులు అక్కడికి చేరుకునే సరికే సాహ్సీ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదన్నారు. ఈ కేసును అబాట్స్ ఫోర్డ్ మేజర్ క్రైమ్ యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని తెలిపారు. దర్శన్ సింగ్ సాహ్సీ సొంత ఊరు పంజాబ్ లోని లుథియానా జిల్లా, రాజ్ గఢ్ గ్రామం. 1991లోనే కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్.. ప్రపంచంలోని అతిపెద్ద రీసైక్లింగ్ కంపెనీల్లో ఒకటి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande