ప్రజలు సంయమనం పాటించాలి.. విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనపై బండి సంజయ్
కరీంనగర్, 28 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల ఘటనపై ప్
బండి సంజయ్


కరీంనగర్, 28 అక్టోబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల ఘటనపై ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు అటెండర్ యాకూబ్ బాషా పై పోక్సో కేసు నమోదైందని, ఈ మొత్తం వ్యవహారం అందరి నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కూడా అవసమైతే పోక్సో కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సీరియస్గా ఉన్నారని పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. విషయం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉందని.. అంతా సమయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పించాలన్నారు. ఇక వంగరలో గురుకుల విద్యార్థి ఆత్మహత్యపై ప్రశ్నించగా.. విద్యార్థి మరణం దారుణమని అన్నారు. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కామెంట్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధమని బండి సంజయ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande