ఏడాది పాటు భారత్ లో చాట్ జీపీటీ గో ఫ్రీ
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) ఏఐ విప్లవం సాంకేతిక రంగంలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తోంది. రోజుకో కొత్త వెర్షన్లతో మానవాళి పరిష్కరించలేని సమస్యలను చిటికెలో సాల్వ్ చేస్తోంది. దీంతో ఏఐ సేవలను అందిస్తున్న సంస్థలు సైతం అంతే అడ్వాన్స్ గా రూపుది
చాట్ జీపీటీ


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

ఏఐ విప్లవం సాంకేతిక రంగంలో

సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తోంది. రోజుకో కొత్త వెర్షన్లతో మానవాళి పరిష్కరించలేని సమస్యలను చిటికెలో సాల్వ్ చేస్తోంది. దీంతో ఏఐ సేవలను అందిస్తున్న సంస్థలు సైతం అంతే అడ్వాన్స్ గా రూపుదిద్దుకుంటూ తమ సేవలను మరింత విస్తృత పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAl) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ ఇటీవల భారత్లో అందుబాటులోకి తీసుకువచ్చిన 'చాట్ జీపీటీ గో' (Chat GPT Go) సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాల ప్రమోషనల్ పీరియడ్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుందని తెలిపింది. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే ఉన్న చాట్ జీపీటీ గో సబ్ స్క్రైబర్లకూ ఈ ఫ్రీ ఆఫర్ వర్తించనున్నట్లు సంస్థ పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande