
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)
, :రాష్ట్రంలో పత్తి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి (బుధవారం) నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. పత్తి కనీస మద్దతు ధర రూ.8,100గా నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ