
నల్గొండ, 28 అక్టోబర్ (హి.స.)
నల్గొండ జిల్లాలోని నకిరేకల్-అర్వపల్లి రహదారిపై పత్తి రైతులు ఇవాళ మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళితే.. శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందని.. కొనుగోలు కేంద్రాలకు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన పత్తిని తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తి చేశారు. అనంతరం పత్తికి నిప్పు పెట్టి నకిరేకల్-అర్వపల్లి రహదారిపై రైతులు బైఠాయించారు. పంట పండించడం ఒక ఎత్తైయితే.. అమ్మడం కూడా అంతకు మించి భారంగా మారిందని, సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు