రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావం
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.) ఏపీ వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల
चक्रवाती


అమరావతి, 28 అక్టోబర్ (హి.స.) ఏపీ వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల చిరుజల్లులు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుపాను ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 2,194 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 3,465 మంది గర్భిణీలు, బాలింతల సంరక్షణకు అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపింది.

19 జిల్లాల పరిధిలోని 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో కమ్యూనికేషన్‌ కోసం 16 శాటిలైట్‌ ఫోన్లు, 35 డీఎంఆర్‌ సెట్లు ఏర్పాటు చేశామని తెలిపింది. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌ 12 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande