
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్
సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అతడి పేరును బిహార్, పశ్చిమ బెంగాల్లోని ఓటర్ల జాబితా నుండి తొలగించింది. ప్రశాంత్ కిషోర్కు పశ్చిమ బెంగాల్లో లోని కాళీఘాట్ రోడ్లోని భజానీపూర్ లో ఓటు హక్కు ఉంది. దీంతో పాటు బీహార్ లోని కార్గహార్ నియోజకవర్గంలోనూ ఓటర్ జాబితాలోనూ ఆయన పేరు ఉంది.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదు. నివసించే ప్రాంతం మారినప్పుడు ఓటర్ నమోదును కూడా బదిలీ చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ పేరును సైతం రెండు జాబితాల్లో ఓటర్ జాబితా నుండి తొలగించినట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..