అత్యాధునిక హంగులతో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్.. ఇంటీరియర్ చూస్తే మతిపోవాల్సిందే
డిల్లీ, 28 అక్టోబర్ (హి.స.)భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే ఈ స్లీపర్‌ ట్రైన్‌ను అత్యానిధునిక హంగులతో తీర్చిదిద్దింది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణ అన
First Vande Bharat Sleeper Train Unveiled: Features, Routes, and L


డిల్లీ, 28 అక్టోబర్ (హి.స.)భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే ఈ స్లీపర్‌ ట్రైన్‌ను అత్యానిధునిక హంగులతో తీర్చిదిద్దింది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా విమానాల స్ఫూర్తితో కూడిన ఇంటీరియర్‌లు, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో ప్రీమియం అనుభవాన్ని అందిచేలా క్యాబిన్‌ను డిజైన్ చేసింది. అయితే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లోని ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌కు సంబంధించిన నమూనా వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నమూనా వీడియోలో ఫస్ట్-క్లాస్ స్లీపర్ క్యాబిన్‌లు, ఎర్గోనామిక్ సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, రీడింగ్ లైట్లు, వై-ఫై కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పాయింట్లు, డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్‌లు, సెన్సార్ ఆధారిత లైటింగ్ ఉన్నాయి. ఇవి నెటిజన్లను ఎంతగానో అకర్షించాయి. ఇది చూడ్డానికి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ డిజైన్‌ను ప్రశంసిస్తూ, భారతదేశ ఇంజనీరింగ్ పురోగతిపై గర్వం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ప్రజా రవాణాలో అలాంటి లగ్జరీని క్యాబిన్‌లను ఏర్పాటు చేస్తే.. జనాలు వాటిని నాశనం చేస్తారని చెప్పుకొచ్చారు.

మరికొందరు ఈ ప్రీమియం సేవలను పొందే అర్హతను నిర్ణయించడానికి క్రెడిట్ స్కోర్ మాదిరిగానే “పౌర స్కోర్” వ్యవస్థను ప్రవేశపెట్టాలని కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా భారతదేశపు మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ ట్రైన్‌లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మరో వ్యక్తి కామెంట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande