
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఇవాళ ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ రూ.3 వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నదాతలకు ఎరువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను సమతుల్యం చేయడం, DAP వంటి ఎరువుల రిటైల్ ధరను కాపాడటం ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ ప్రధాన లక్ష్యమని సమాచారం. ముఖ్యంగా ఈ సబ్సిడీతో రైతులకు ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండటం, ఆహార భద్రత, వ్యవసాయ వృద్ధి మద్దతుకు ఊతం ఇవ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంలో దేశంలోని 14.6 కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు