భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఢిల్లీలోకి బీఎస్-6, సిఎన్జ, ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో రోజు రోజుకి గాలి నాణ్యత భారీగా పెరుగుతుంది. ఇటీవల దీపావళి పండుగ తో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు తగలబెట్టడం ద్వారా వచ్చిన పొగ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అయితే రో
ఢిల్లీ కాలుష్యం


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో

రోజు రోజుకి గాలి నాణ్యత భారీగా పెరుగుతుంది. ఇటీవల దీపావళి పండుగ తో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు తగలబెట్టడం ద్వారా వచ్చిన పొగ కారణంగా పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అయితే రోజురోజుకి పెరుగుతున్న ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోకి బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వాణిజ్య వాహనాలు (లైట్ గూడ్స్ వాహనాలు, మిడ్ హెవీ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు) ప్రవేశించకుండా నిషేధం విధించింది. తాజా నిర్ణయంతో ఢిల్లీ నగరంలోని రోడ్లపైకి సిఎనీ, ఎల్ఎన్జ, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఢిల్లీలోనే నమోదు చేయబడిన వాహనాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. అయితే మార్పు దశలో సడలింపు చర్యగా బీఎస్-4 వాణిజ్య వాహనాలకు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఈ వాహనాలు 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే ఢిల్లీకి ప్రవేశించగలవని CAQM పేర్కొంది. వాహన ఉద్గారాలు వాయు నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, దీనివల్ల ప్రతి సంవత్సరం ఢిల్లీలో శీతాకాలం సమయంలో వాయు కాలుష్యం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాజధానిలో కాలుష్య స్థాయిని తగ్గించడంలో కీలక మలుపు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande