
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆసక్తికరంగా మారుతుంది.
రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం గా మారబోతోందని అంచనా వేస్తున్న ఈ బై ఎలక్షన్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో 'ఆటో పాలిటిక్స్' ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆటోడ్రైవర్ల సమస్యల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నేతలు ఆటోలలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోగా ఇవాళ మంత్రి సీతక్క ఆటోలో ప్రయాణించడం చర్చనీయాశంగా మంగళవారం జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించిన సీతక్క.. ఈ సందర్భంగా ఆటోలో ప్రయాణించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలకు ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టిందని తెలిపారు. మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు