మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత బండి ప్రకాష్ (ప్రభాత్) సరెండర్
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అగ్ర నేతల వరుస లొంగబాట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర
మావోయిస్ట


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అగ్ర నేతల వరుస లొంగబాట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. గత 45 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు.

కాగా, మావోయిస్టు పార్టీ సీనియర్ నేత అయిన బండి ప్రకాశ్ ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో చెరగని ముద్ర వేశారు. సింగరేణిలోనే పని చేస్తూ అప్పటి పీపుల్స్వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై 1980లో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరాడు. 1988 సంవత్సరంలో బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్షను అనుభవిస్తూనే నాటి పీపుల్స్ వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్, తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలుకొట్టి మరి తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే, అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్ అయింది. అనంతరం 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాశ్ 2004లో విడుదలయ్యారు. సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ అడవి బాట పట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande