కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు
నారాయణపేట, 28 అక్టోబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు, అనంతరం కార్తీక దీపోత్సవం వాటి విశిష్టతను గురించి వివరించారు. హిందూ
మంత్రి వాకిటి శ్రీహరి


నారాయణపేట, 28 అక్టోబర్ (హి.స.) నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు, అనంతరం కార్తీక దీపోత్సవం వాటి విశిష్టతను గురించి వివరించారు. హిందూ ధార్మిక ప్రకారం కార్తీక మాసం విశిష్టమైందని ప్రకృతి పరంగా వర్షాలు కురిసి పచ్చదనంతో వికసించిన పూలతో ప్రకృతి పరవశించిపోతూ భక్తులను కనువిందుగా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకుపోయే మాసం కార్తీక మాసం అన్నారు.

కార్తిక మాసం నెల రోజులు మనిషి యొక్కదిన చర్యలు ప్రవర్తనను మార్చి సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగాను దైనందికంగాను దారి చూపుతోందని అందుకు ప్రతి ఒక్కరు తెల్లారు జామున చల్లటి నీటితో స్నానం చేయడంవల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యం చేకూరుస్తుందని దేవాలయాల్లో నేయ్య తోదీపం వెలిగించడం వల్ల కంటిచూపు స్వాస మెరుగుపడుతుందని ఈ కాలంలో శాకాహారంగా తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కార్థిక మాసం దినచర్యలకు మార్పుఉంటుందని, అందుకే ప్రతి ఒక్క దేవాలయంలో తెల్లవారు దీపాలు వెలిగించడం తేల్లారక ముందుకు నిద్ర లేవడం వల్ల ఆరోజు మానసికంగా శారీరకంగా ఉత్సవం ఉల్లాసంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరుపణ అని కార్తీకమాసం దీపాలు వెలిగించడం తో అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాస మని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande