హరీశ్ రావు తండ్రి మృతి.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బంద్ చేసిన బీఆర్ఎస్
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ని
Brs


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకొని.. సత్యనారాయణ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికి మాజీ సీఎం కేసీఆర్ , సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే హరీశ్ రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి మృతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande