
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ఈ రోజు అనగా మంగళవారం సాయంత్రం యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ జరగనుంది. ఈ సభకు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ పెద్దలు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండటంతో ఈ అభినందన సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరఉండి అభినందన సభ పనులనలను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అభినందన సభ ఉండటం, సినిమా ఇండస్ట్రీకి కీలక కావడంతో ఫిలిం ఫెడరేషన్ అన్నయ్య తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన అన్ని షూటింగ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు చేస్తున్న సన్మాన సభ కావడంతో అన్ని యూనియన్లలోని సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..