
హుజురాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హుజరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మంగళవారం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజరాబాద్ ఏసిపి మాధవి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు ఆఫీసర్లతో పాటు హుజరాబాద్కు చెందిన పలువురు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఏసిపి మాధవి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. వ్యాయామంతో ఎటువంటి రుగ్మతలనైనా తగ్గించుకోవచ్చని ఆమె అన్నారు. అలాగే, ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడం వల్ల పోలీసులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఏసిపి మాధవి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు