
చిత్తూరు 28 అక్టోబర్ (హి.స.) జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు బస్సుల్లో ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ