అభివృద్ధి విషయంలో తగ్గేదేలే : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, 28 అక్టోబర్ (హి.స.) షాద్ నగర్ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా. అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేగా నా బాధ్యత.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. అభివృద్ధి విషయంలో తగ్గేదేలేదని” షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్
షాద్నగర్ ఎమ్మెల్యే


షాద్నగర్, 28 అక్టోబర్ (హి.స.)

షాద్ నగర్ నియోజకవర్గాన్ని అందరి

సహకారంతో అభివృద్ధి చేస్తా. అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేగా నా బాధ్యత.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. అభివృద్ధి విషయంలో తగ్గేదేలేదని” షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సుమారు రూ. 105 కోట్ల రూపాయల నిధులతో 140 కిలోమీటర్ల మేరకు గ్రామీణ రహదారుల అనుసంధానం కోసం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దీనికోసం టెండర్లు కూడా వేయడం జరిగిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని ఆయన వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande