విద్యార్థుల భోజనం వసతి, చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. సిద్దిపేట కలెక్టర్
సిద్దిపేట, 28 అక్టోబర్ (హి.స.) విద్యార్థులు భోజనం చేస్తుంటే టీచర్ లు ఎవరు మానిటర్ చేయడం లేదు.. విద్యార్థులు భోజన ప్రక్రియను మానిటర్ చేస్తేనే వారు క్రమశిక్షణా పాటిస్తారని ఇష్టానుసారంగా వదిలేస్తే ఎలా అని ప్రిన్సిపాల్ తీరుపై సిద్దిపేట జిల్లా కలెక్టర
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 28 అక్టోబర్ (హి.స.)

విద్యార్థులు భోజనం చేస్తుంటే టీచర్ లు ఎవరు మానిటర్ చేయడం లేదు.. విద్యార్థులు భోజన ప్రక్రియను మానిటర్ చేస్తేనే వారు క్రమశిక్షణా పాటిస్తారని ఇష్టానుసారంగా వదిలేస్తే ఎలా అని ప్రిన్సిపాల్ తీరుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, తెలంగాణ సామాజిక బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ప్రక్రియను తనిఖీ చేశారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో టీచర్లు మానిటర్ చేయాలని సూచించారు. రోజు విద్యార్థులందరూ తిన్నకే టీచర్ లు అందరూ తినాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఆహార పదార్థాలను పరిశీలించి విద్యార్థుల హాజరు ప్రకారం రైస్ కూరగాయలు కొలత ప్రకారం ఇవ్వాలని ఫుడ్ చెకింగ్ టీచర్ ను ఆదేశించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల భోజనం వసతి, చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande