వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి :సూర్యాపేట జిల్లా కలెక్టర్
సూర్యాపేట, 28 అక్టోబర్ (హి.స.) రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పాటు టార్పాలిన్ పట్టాలు కప్
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 28 అక్టోబర్ (హి.స.) రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పాటు టార్పాలిన్ పట్టాలు కప్పే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం, అర్వపల్లి, వేల్పుచర్లలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. మొంథా తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి పొలాలు కోయకుండా ఉండాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande