
వనపర్తి, 28 అక్టోబర్ (హి.స.) నవంబర్ 01వ తేదీ లోపు డయాలసిస్
సెంటర్ ను నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిలువ ఉండకుండా డ్రైనేజ్ కాలువలను, ఇంకుడు గుంతలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీజీఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ఎంసీహెచ్ లలో ఆక్సిజన్ ప్లాంట్ల ను వాడుకలోకి తీసుకురావాలని సూచించారు.
స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ విభాగం మొదటి అంతస్తులో ఉన్నందున రోగులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవంబర్ 1 నాటికి జీజీహెచ్ లో ఉన్న డయాలసిస్ విభాగాన్ని నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు