ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్.. భారత జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) మహిళల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ వేళ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. మంచి ఫామ్లో ఉన్న ఆమె ఆస్ట్రేలియాతో సెమీస్కు దూరమవడం భారత జట్టుకు భారీ
మహిళల క్రికెట్


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

మహిళల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ వేళ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. మంచి ఫామ్లో ఉన్న ఆమె ఆస్ట్రేలియాతో సెమీస్కు దూరమవడం భారత జట్టుకు భారీ దెబ్బ గా మారింది. అయితే ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ప్రతీక రావల్ స్థానంలో షఫాలీ వర్మ ను జట్టులోకి చేర్చినట్లు అధికారికంగా సోమవారం ఐసీసీ ధృవీకరించింది. ఈ మార్పుకు ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం కూడా లభించింది.

గాయపడ్డ ప్రతికా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ ప్రస్తుతం దేశీయ క్రికెట్లో దూసుకుపోతుంది. సీనియర్ మహిళల T20 లీగ్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా షఫాలీ నిలిచింది. ఆమె హర్యానా తరఫున ఏడు ఇన్నింగ్స్ ల్లో 341 పరుగులు అందులో ఒక శతకం, రెండు అర్థ శతకాలు సాధించింది. ఆమె సగటు 56.83 కాగా, స్ట్రైక్ రేట్ 182.35. ఈ ఫార్మ్ ఉన్న షఫాలీ ఇప్పుడు భారత జట్టులో చేరడం టీమ్ ఇండియాకు మంచి ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande