
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)మొంథా తుఫాను (Cyclone Montha) ప్రభావం కారణంగా ఈ రోజు అక్టోబర్ 28న నిర్వహించాల్సిన (Andhra University) ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రాలలోని తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగాల వాక్–ఇన్ ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రకటించారు.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త తేదీ ప్రకారం ఈ ఇంటర్వ్యూలు నవంబర్ 6న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్ర పరిపాలన కార్యాలయం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగ అభ్యర్థులు కొత్త తేదీని గమనించాలని విశ్వవిద్యాలయం అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV