భారతీయులకు మరో తీపికబురు.. దుబాయ్‌లో పాస్‌పోర్ట్‌ సేవా ప్రోగ్రాం షురూ
ఢిల్లీ, 28 అక్టోబర్ (హి.స.) భారతీయులకు దుబాయ్‌ (Dubai)లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం (Consulate General of India) తీపికబురు చెప్పింది. పాస్‌పోర్టు అప్‌గ్రేడెడ్ సేవా ప్రోగ్రాం (GPSP 2.0ను ఇవాళ్టి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. దరఖ
another-good-news-indians-passport-service-program-starts-in-dubai-488206


ఢిల్లీ, 28 అక్టోబర్ (హి.స.) భారతీయులకు దుబాయ్‌ (Dubai)లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం (Consulate General of India) తీపికబురు చెప్పింది. పాస్‌పోర్టు అప్‌గ్రేడెడ్ సేవా ప్రోగ్రాం (GPSP 2.0ను ఇవాళ్టి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్టులలో ఏమైనా తప్పులుంటే కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకుని సరిచేసుకోవాలని సూచించారు. ఇందులో కోసం దుబాయ్ వ్యాప్తంగా ప్రత్యేకంగా పాస్‌పోర్టు అప్‌గ్రేడెడ్ సేవా కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. ఈ పాస్‌పోర్టు అప్‌గ్రేడెడ్ సేవా ప్రోగ్రాంతో పాసుపోర్టు దరఖాస్తు ప్రక్రియ సులభతరం కావడమే కాక, సేవా కేంద్రాల్లో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండే సమయం తగ్గనుంది.

ఇక నుంచి సురక్షిత చిప్‌తో కూడిన డిజిటలైజ్డ్ హోల్డర్ డేటాతో కూడిన పాస్‌పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాఫీగా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ను పొందవచ్చు. పాస్‌పోర్టులో మార్పులు చేర్పులకు గాను స్వయంగా దరఖాస్తుదారులే ఫోటోను, సంతకాన్ని, కావాల్సిన డాక్యుమెంట్లను నేరుగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించారు. అదేవిధంగా పాస్‌పోర్టులో ఏమైనా స్వల్ప దోషాలు ఉంటే నేరుగా పాస్‌పోర్టు సేవా ప్రోగ్రాంలో భాగంగా సరిచేసుకోవచ్చని.. అందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండబోవని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande