
చెన్నై:, 28 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడు(Tamil Nadu)లో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. కాగా చెన్నై సహా 8 జిలాల్లో భారీవర్షం పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డీడీజీఎం డాక్టర్ పి.అముద తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుఫాను కారణంగా తిరువళ్లూర్ జిల్లాల్లో మంగళవారం అతి భారీవర్షాలు, చెన్నై, రాణిపేట, కాంచీపురం, చెంగల్పట్టు, తేని, తెన్‌కాశి, తిరు నల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 1వ తేది నుంచి సోమవారం వరకు 57 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో సాధారణం కన్నా అదనపు వర్షపాతం నమోదైందని వివరించారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 144 మి.మీ కాగా, ప్రస్తుతం 227 మి.మీ వర్షపాతం నమో దైందని డైరెక్టర్ అముద తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు