
విజయవాడ, 28 అక్టోబర్ (హి.స.) భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్(NTR District Collector) అప్రమత్తమయ్యారు. విజయవాడలో షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్, పాలు, కూరగాయల షాపులు తప్ప ఏవీ ఏ దుకాణం ఓపెన్ చేయొద్దని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. 16 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలు తెరచుకోవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV